Header Banner

ఏమిటీ వింత! మామిడి చెట్టుకు సొరకాయలు! మరోచోట దర్శనమిచ్చిన అరుదైన పుట్టగొడుగు!

  Wed May 21, 2025 16:31        Others

గొలుగొండ మండలంలో మామిడి చెట్టును పందిరిగా చేసుకుని పాకిన సొర పాదు - మారేడుమిల్లిలో దర్శనమిచ్చిన అరుదైన పుట్టగొడుగు.

 

సాధారణంగా సొరకాయ, బీరకాయ, దొండకాయ, కాకరకాయలు పందిళ్లకు వేలాడుతుంటాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గాధంపాలెం గ్రామంలో ఓ రైతు ఇంటి ఆవరణలోని మామిడి చెట్టును పందిరిగా చేసుకుని సొర పాదు పాకి కాయలు కాస్తోంది. ఇది అచ్చం మామిడి చెట్టుకు సొరకాయలు కాసినట్లు కనిపిస్తుండటంతో గ్రామస్థులంతా ఆసక్తిగా చూస్తున్నారు.

 

అరుదైన పుట్టగొడుగు: అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలో శనివారం అరుదైన పుట్టగొడుగు దర్శనమిచ్చింది. గుజ్జుమామిడివలస పంచాయతీ పరిధిలోని వాలమూరులోని ‘జంగిల్‌ స్టార్‌ నేచర్‌ క్యాంపు’ వద్ద ఈ అరుదైన పుట్టగొడుగు కనిపించింది. దీనికి సంబంధించిన వివరాలను జంగిల్‌స్టార్‌ నేచర్‌ క్యాంపు సమన్వయకర్త ఆమర్తి వీరబాబు వెల్లడించారు. దీనిని సాధారణంగా వెదురు పుట్టగొడుగు, వెదురు పిత్, బ్రైడల్‌ వీల్‌ అని పిలుస్తుంటారని ఆయన తెలిపారు.

 

దక్షిణ ఆసియా, ఆఫ్రికా, అమెరికా ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఎక్కువగా ఈ రకమైన పుట్టగొడుగు ఉంటుందన్నారు. ఘాటైన వాసన కలిగి, ఆకుపచ్చ, గోధుమ రంగులో ఉండి, బురదలో ఇవి పెరుగుతాయని అన్నారు. ఈగలు, ఇతర కీటకాలను ఆకర్షించి, బీజాంశాలను వ్యాప్తి చేయడంలో ఈ పుట్టగొడుగు సహాయపడుతుందన్నారు. చైనాలో దీనిని సంప్రదాయ వంటకాలు, ఔషధాల్లోనూ వినియోగిస్తారని, ప్రధానంగా తలనొప్పి, రక్తపోటు చికిత్సలో ఉపయోగిస్తారని తెలిపారు.

 

కాండానికి కాసిన మామిడికాయలు: అదేంటి మామిడి కాయలు కొమ్మలకు కదా కాస్తాయి అనుకుంటున్నారా? కాండం వద్ద ఎలా ఉన్నాయనుకుంటున్నారా? అదికూడా మహా అయితే ఒక కొమ్మకు ఒకటి రెండు కాయలు కాస్తేనే ఆ కొమ్మ కిందకు వేలాడుతుంది. కానీ కాండం వద్ద ఇలా ఒకే కాడకు గుత్తులుగా మామిడి కాయలు కాసి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నంద్యాల జిల్లా డోన్‌ మండలం ఉంగరానిగుండ్ల సమీపంలో రైతు గోపాల్‌ మామిడి తోటలో ఓ చెట్టు కాండానికి ఈ విధంగా గుత్తులు గుత్తులుగా మామిడి కాయలు కాసి అబ్బురపరుస్తున్నాయి. జన్యుపరంగా ఒక్కోసారి మామిడి చెట్టుకు ఇలా కాపుగాస్తాయని ఉద్యానశాఖ అధికారిణి కల్యాణి తెలిపారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! ఈ రూట్ లోనే ఫిక్స్ - ఆ నేషనల్ హైవేకు దగ్గరగా.!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

 ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

 

 అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!

 

 టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

 రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! జూన్ నుంచి ఇలా..!

 

ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ఆపరేషన్ వైసీపీ! నెక్స్ట్ వికెట్..!

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

వారిని అభినందించిన లోకేష్.. ఏపీలో విద్యాసంస్కరణలపై దేశ వ్యాప్తంగా..

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 


   #AndhraPravasi #WonderOfNature #MangoTree #CucumbersOnTree #RareFind #NatureSurprise #UnusualFruits #NatureMagic